Jul 20,2023 21:47

రేషన్‌కార్డు అందజేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి - పాచిపెంట :  ప్రజల కష్టాలను తెలుసుకొని వారికి కావాల్సిన సర్టిఫికెట్లు ఉచితంగా అందించడమే కాకుండా అర్హత కలిగిన ప్రతి ఒకరిని గుర్తించి సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్యోద్దేశమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. మండలంలోని పాంచాలిలో గురువారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్యోద్దేశమన్నారు. జగనన్న సురక్ష ప్రజలకు ఒక వరమని, అర్హత ఉండీ పథకాలు పొందలేని వారికి ఒక అవకాశంగా నిలుస్తుందని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఆయన ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల, ఎంపిపి ప్రతినిధి చిన్నబాబు, తహశీల్దార్‌ రాజశేఖర్‌, జెఎసి కన్వీనర్‌ గౌరీశ్వరరావు, వైస్‌ ఎంపిపి రవీంద్రనాథ్‌, సర్పంచులు, ఎంపిటిసిలు, స్థానిక మాజీ సర్పంచ్‌ నారాయణరావు, పెద్దిబాబు, వెంకట్రావు, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం : జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందిని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ పి.విక్రాంత్‌ అన్నారు. మండలంలోని వండువలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే నర్సిపురం గ్రామంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు ధ్రువ పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఎం.కల్యాణి, కె.సత్యవతి, ఎంపిపి డి.వెంకటరమణనాయుడు, జెడ్పిటిసి జంపు కన్నతల్లి - ఉమామహేశ్వరరావు, వైస్‌ ఎంపిపి పి.విజయకుమారి, భార్గవ్‌, డిఆర్డిఏ పిడి పి.కిరణ్‌కుమార్‌, తహశీల్దారు సిహెచ్‌ సత్యనారాయణ, ఎంపిడిఒ జి.జయంత్‌ ప్రసాద్‌, సచివాలయ కార్యదర్శులు సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని లచ్చయ్యపేట గ్రామ సచివాలయంలో జరిగిన జగనన్న సురక్ష క్యాంప్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జగనన్న సురక్ష క్యాంప్‌ ద్వారా అర్జీ పెట్టుకున్న అర్హులకు మంజూరైన 11రకాల సేవల ధ్రువీకరణ పత్రాలను ఆర్జీదారులకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, ఎంపిపి ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, వైస్‌ ఎంపిపిలు, పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, స్థానిక సర్పంచ్‌ చింతాడ కృష్ణ, ఎంపిటిసి అక్కపోలు సింహాచలం, ఎంపిడిఒ ప్రసాద్‌, మండల సీనియర్‌ నాయకులు అంబటి కృష్ణమూర్తి, పోల ఈశ్వరనారాయణ, ఆర్వి, ఎం.రామకష్ణ, మర్రాపు ధనుంజరు, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరలు పాల్గొన్నారు.
గిరిశిఖర వనకాబడిలో జగనన్న సురక్ష
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని గిరిశిఖర వనకాబడి పంచాయతీలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం సర్పంచ్‌ కొత్తమ్మ అధ్యక్షతన నిర్వహించారు. తహశీల్దార్‌ బృందం పాల్గొన్నారు. జగనన్న సురక్షా ద్వారా 11రకాల సర్టిఫికెట్లు అందించడం అదృష్టమని తహశీల్దార్‌ జె.రాములమ్మ అన్నారు. అనంతరం అర్హులకు ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఇదిలాఉంటే జగనన్న సురక్షా కార్యక్రమం నేపథ్యంలో మండలంలో రోడ్డు పక్క పంచాయితీలకే ప్రత్యేక అధికారులు పరిమితమయ్యారని పలువురు ఆరోపించారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి జి.జగదీష్‌ కుమార్‌, ఎపిఎం శివరామకృష్ణ, కార్యదర్శి రామకృష్ణ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,పాల్గొన్నారు.
సాలూరు రూరల్‌ : మండలంలోని గంజాయిభద్ర పంచాయతీ నేరళ్లవలస సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ సుమారు 250 మంది లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్పర్సన్‌ దండి అనంతకుమారి, ఎంపిడిఒ ఎ.రమాదేవి, వైసిపి నాయకులు దండి శ్రీనివాసరావు, సువ్వాడ భరత్‌ శ్రీనివాస రావు, సువాడ రామకృష్ణ, బోసు తదితరులు పాల్గొన్నారు.
జిల్లేడువలసలో....
మండలం జిల్లేడు వలస సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు కురుకూటి ఎంపిటిసి సభ్యులు గెన్నెల సుబ్బారావు ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి పి.రమణమూర్తి, కారాడవలస సర్పంచ్‌ గెమ్మెల శంకర రావు పాల్గొన్నారు.