ధ్రువపత్రాన్ని అందజేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర
సాలూరు : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించడానికే జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టినట్లు డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర చెప్పారు. శుక్రవారం పట్టణంలోని నాయుడు వీధి, నెయ్యిల వీధుల్లో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా 11రకాల సేవలు ప్రభుత్వం అందేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పైసా ఖర్చులేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందజేశారని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకు రావడానికి ప్రజలు సిద్ధంగా వుండాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, జర్జాపు దీప్తి, పట్టణ మాజీ అధ్యక్షుడు జర్జాపు సూరిబాబు, కమిషనర్ హెచ్ శంకరరావు పాల్గొన్నారు.










