Jul 04,2023 20:35

ఆదోనిలో మాట్లాడుతున్న కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఆదోని
పెండింగ్‌లో ఉన్న సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి, ప్రజలకు రక్షగా రాష్ట్ర ప్రభుత్వం 'జగనన్న సురక్ష'ను తీసుకొచ్చిందని మున్సిపల్‌ ఛైర్మన్‌ శాంత తెలిపారు. మంగళవారం పట్టణంలోని అరుణ్‌ జ్యోతి నగర్‌ జిఆర్‌ గార్డెన్స్‌లో రెండో క్యాంప్‌ డే నిర్వహించారు. సంబంధిత వార్డు ప్రజలకు సర్టిఫికెట్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వాలంటీర్లు వారం పాటు ఇంటింటికీ తిరిగి సమస్యలను గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారన్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ అనుపమ, మున్సిపల్‌ ఇంజినీర్‌, వైస్‌ ఛైర్మన్లు నరసింహులు, గౌస్‌ పాల్గొన్నారు.