ప్రజాశక్తి-గూడూరు : సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాల అమలు తీరుకు సంబంధించి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెడన నియోజకవర్గం లో మచిలీపట్నం పార్లమెంటరీ సభ్యుడు వల్లభనేని బాలశౌరితో కలిసి పెడన మండలం కమలాపురం సచివాలయ పరిధిలో ఉప్పల కలువ గుంటపాలెం, కమలాపురం గ్రామాలలో విస్తతంగా పర్యటించారు. ఉప్పలకలవగుంట గ్రామంలో 43.60 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని, 23.94 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, చేవేండ్ర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లోనాడు నేడు పథకంలో భాగంగా 65.30 లక్షలు వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతుల ప్రారంభోత్సవం చేశారు. పెడన ఎంపీపీ రాజులపాటి వాణి అచ్యుతరావు, వైస్ ఎంపీపీ యాడంరెడ్డి వరప్రసాద్, పెడన మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ గరికపాటి చారు మతి రామా నాయుడు, కమలాపురం గ్రామ సర్పంచ్ గుడిసేవ శ్రీనివాసరావు, చేవేండ్ర గ్రామ సర్పంచ్ ఉచ్చుల భాస్కరరావు పాల్గొన్నారు.










