Jul 12,2023 21:45

పథకాలు గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

ప్రజాశక్తి - కురుపాం : సమస్యల పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మండలంలోని జి. శివడ, అంటిజోల, తాటిపాడుగూడ, కించాయిగూడ, పెద్ద అంటి జోల గిరిజన గ్రామాల్లో బుధవారం ఆమె పర్యటించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందే తీరును అడిగి తెలుసుకున్నారు. ఇంకేమైనా సమస్యలుంటే సచివాలయ సిబ్బందికి, వాలంటర్లకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ బి. మిన్నారావు, ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్‌పిటిసి సభ్యులు జి. సుజాత, జిల్లా కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ నిసార్‌, మండల కన్వీనర్‌ ఐ.గౌరీశంకర్‌, వాణిజ్య విభాగాల వైసిపి జిల్లా అధ్యక్షులు అంధవరపు కోటేశ్వరరావు, నాయకులు గురుబిల్లి రాజారావు, మైనార్టీ విభాగ నాయకులు షేక్‌ నూరెళ్ళ తదితరులు పాల్గొన్నారు.