ప్రజాశక్తి - మార్టూరు రూరల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల అమలు, ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరానికే గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైసిపి ఇంచార్జ్ ఆమంచి కృష్ణ మోహన్ అన్నారు. మార్టూరు గొట్టిపాటి హనుమంతరావు కాలనీ, ఆది జాంబవ కాలనిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చుండి సుజ్ఞానమ్మతో కలిసి గడప గడప పర్యటించారు. ప్రజల సమస్యల పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ నవరత్నాలను ప్రవేశపెట్టారని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పదకాలు అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పధకాల కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సచివాలయ వ్యవస్థతో నేరుగా లబ్దిదారులకు అందిస్తున్న ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందని అన్నారు. నాడు- నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వాటి రూపురేఖలను మార్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్టూరు సర్పంచ్ సుమితా భాయి, రాజానాయక్, ఎంపీపీ భూక్యా శాంతి భాయ్, బాబు నాయక్, గర్నెపూడి రవిచందు, వక్ఫ్ బోర్డు జిల్లా కార్యదర్శి గడ్డం మస్తాన్ వలి, వైసిపి మండల కన్వీనర్ పటాన్ కాలేషా వలి, ఉపసర్పంచ్ కాకోలు రామారావు, కాకోలు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










