May 09,2023 00:22

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపి అయోధ్యరామిరెడ్డి, మేయర్‌ తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగర ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు అన్నారు. సోమవారం మేయర్‌ ఛాంబర్‌లో నగర ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి డయల్‌ యువర్‌ మేయర్‌ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎంపి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, ఎమ్మెల్యేలు మహమ్మద్‌ ముస్తఫా, మద్దాలి గిరిధర్‌, కమిషనర్‌ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ప్రజలు తమ స్థానిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి 9849908384 నంబర్‌కు ఫొటో కాని, వీడియో కాని, వాట్సప్‌ ద్వారా వారి పూర్తిపేరు, ఫోన్‌ నెంబర్‌, పూర్తి చిరునామాతో తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలను వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని మేయర్‌ మనోహర్‌ నాయుడు తెలిపారు.