
సమస్య పరిష్కారినికి శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే
ప్రజాశక్తి - చాగలమర్రి
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్విత పరిష్కారం చూపడమే తన బాధ్యత అని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం చాగలమర్రిలోని నారాయణ పల్లె రస్తాలోని జగనన్న లేఔట్లలో సయ్యద్ లాలూ మియా నిర్మించుకున్న నూతన గృహాన్ని, మన్సూర్ వాటర్ ఏజెన్సీని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిడిపి నేతలకు ఎలక్షన్ల ముందు అన్ని గుర్తొస్తాయని తరువాత వాటిని పట్టించుకోరని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెసిఎస్ కోఆర్డినేటర్ షేక్ బాబులాల్, మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, ఏపీ టి సిసిఏ రాష్ట్ర అధ్యక్షుడు షరీఫ్ ఖాన్, మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ, మండల కో ఆప్షన్ సభ్యులు జిగ్గీ గారు ఇబ్రహీం, సింగిల్ విండో అధ్యక్షుడు దస్తగిరి, ఎంపీటీసీలు ఫయాజ్, లక్ష్మిరెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గణేష్ రెడ్డి, సాగునీటి సంఘ అధ్యక్షుడు శేషు రమేష్, మాజీ ఉపసర్పంచ్ అబ్దుల్లా భాష, వైసిపి నాయకులు వెంకటరమణ, చక్రం బీడీ షబ్బీర్, ముల్లా ఖాదర్బాషా, అబ్దుల్లా, పెయింటర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.