ప్రజాశక్తి -కంచరపాలెం : శ్మశానవాటిక అక్రమిస్తే చర్యలు తప్పవని జివిఎంసి ఐదో జోన్ కమిషనర్ ఆర్‌జివి కృష్ణ హెచ్చరించారు శుక్రవారం 53వ వార్డు, డాక్టర్ జాకీర్ హుస్సేన్‌నగర్ వద్ద జివిఎంసి ముస్లిం శ్మశానవాటిక ప్రధాన ద్వారం వద్ద బోర్డు ఏర్పాటు చేసారు. శ్మశానవాటికపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సచివాలయ టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఆదేశించారు. కొంతమంది సంఘం పేరుతో శ్మశానవాటికను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఇటీవలే జాకీర్ హుస్సేన్ నగర్ మస్జిద్ -ఈ -అల్ ఖదీర్ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జెడ్‌సి స్పందించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరైనా శ్మశాన వాటికను ఆక్రమించే ప్రయత్నం చేస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారిని శ్రీలక్ష్మీ, చైన్‌మెన్లు శివ ప్రశాద్, సతీష్, అప్పరావు, సచివాలయం టౌన్ ప్లానింగ్ సిబ్బంది కె.శాంతి, పి.జ్ఞాన ప్రకాష్, కె. నాని కుమార్ పాల్గొన్నారు.










