Dec 13,2022 23:59

కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న పరశురాం

ప్రజాశక్తి -గాజువాక : వై జంక్షన్‌ వద్ద ఉన్న శ్మశాన వాటికలో నిరీక్షణకు షెల్టర్‌ ఏర్పాటు చేయాలని సుందరయ్య కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్‌వికె.పరశురాం మంగళవారం జివిఎంసి కమిషనర్‌ రాజాబాబుకు, ఎమ్మెల్యే నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. మూడు వార్డులకు చెందిన ప్రజలకు ఈ శ్మశాన అందుబాటులో ఉందని తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారు, ఆసుపత్రిలో చనిపోయిన వారిని తీసుకొస్తే వై జంక్షన్‌ రోడ్డు పక్కన మృతదేహాన్ని ఉంచాల్సి వస్తుందని వివరించారు. దీనివల్ల ఎండలు, వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.
అగనంపూడి సమస్యలపై వినతి
అగనంపూడి సమస్యలపై జివిఎంసి కమిషనర్‌ పి.రాజాబాబుకు ఎడిసి చైర్మన్‌ బలిరెడ్డి సత్యనారాయణ, ఫార్మాసిటీ నిర్వాసిత కాలనీ నాయకులు కసిపల్లి శ్రీనివాసరావు వినతి పత్రం అందజేశారు. అగనంపూడి టోల్‌ గేటును తొలగించాలి, 88వ వార్డు పరిధి తలారివానిపాలెం వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి అండర్‌ గ్రౌండ్‌ రోడ్డు విస్తరణ చేయాలని, అగనంపూడి జాతీయ రహదారి నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్‌ వరకు విద్యుత్‌ దీపాలు వెయ్యాలని, అగనంపూడి కేన్సర్‌ హాస్పిటల్‌ నుంచి ఏడు చెట్లు మర్రిపాలెం వరకు రోడ్డు విస్తరణ చేసి విద్యుత్‌ దీపాలు వేయాలని, అగనంపూడిలో రైతు బజారు ఏర్పాటుచేయాలని, శ్మశాన వాటికను అభివృద్ధి పరచాలని, సివేజ్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని వినతిలో కోరారు.