మొక్కలు నాటుతున్న అప్పలరాజు తదితరులు
ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 12వ వార్డు పరిధి పెదగదిలి శ్మశాన వాటికలో గ్రామ అధ్యక్షులు బొట్ట అప్పలరాజు తన సొంత నిధులతో 50 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుణుపూరు శ్రీనివాసరావు, కోశాధికారి ఒమ్మి అప్పలరాజు, సలహాదారులు ఎన్.సుబ్బిరెడ్డి, సంఘం సభ్యులు చల్ల రాజు, పాల్తేరు శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.










