Oct 01,2023 22:13

ప్రజాశక్తి - ముదినేపల్లి
   ముదినేపల్లి ఎస్‌సి స్మశాన వాటికలో పంచాయతీ ఆధ్వర్యంలో పిచ్చిమొక్కలు నిర్మూలనా మందును పిచికారి చేశారు. ఇటీవల వరసగా కురుస్తున్న వర్షాలకు స్మశాన వాటికలో దట్టంగా పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగాయి. వాటి కారణంగా స్మశానంలో పాముల సంచారం కూడ అధికమైంది. మృతదేహాలను ఖనణం చేసే సమయంలో తరచూ విషపాములు కనబడడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ విషయం సర్పంచి నిమ్మగడ్డ కైకమ్మ దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యను పరిష్కరించేందుకు వెంటనే సర్పంచి రూ.4వేలు విలువ చేసే మందును కూలీలతో స్మశాన వాటికలో పిచికారి చేయించారు. పిచికారి పనులను కైకమ్మ, వైసిపి నేత నిమ్మగడ్డ భిక్షాలు దగ్గర ఉండి పర్యవేక్షించారు.