శ్మశాన వాటికకి దారేది..!
- ఏ అధికారికి చెప్పినా పట్టని గోడు- మృతదేహంతో ఆందోళన
ప్రజాశక్తి - గూడూరు రూరల్ : ' మా శ్మశాన వాటికకు దారి లేదు.. ఏ అధికారికి చెప్పినా మా గోడు పట్టించుకోలేదు..' అంటూ తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం విందూరు గ్రామం వద్ద గ్రామస్తులు మతదేహంతో శుక్రవారం ఆందోళన చేపట్టారు. కొందరు స్థానిక నేతలు స్మశానానికి వెళ్లే రహదారిని ఆక్రమించారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో గ్రామ శివారు ప్రాంతంలోని శ్మశాన వాటిక సమీపంలో మతదేహాన్ని నేలపై ఉంచి శ్మశానానికి దారి చూపాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యని ఎవరి దష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడంలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణ దారుల చెర నుండి శ్మశాన వాటిక స్థలాన్ని విడిపించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.










