Nov 22,2022 23:55

శంకుస్థాపన చేస్తున్న ఎంపిపి వాసురాజు

ప్రజాశక్తి -భీమునిపట్నం : మండలంలోని మూలకుద్దు పంచాయతీ పాత మూలకుద్దు శ్మశాన వాటికలో దివీస్‌ ఆధ్వర్యాన రూ.16 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎంపిపి దంతులూరి వెంకట శివ సూర్య నారాయణ రాజు మంగళ వారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్‌ కొల్లి పార్వతి, వైసిపి నాయకులు కొల్లి కోటిరెడ్డి, పొట్నూరు చంద్రశేఖర్‌, దివీస్‌ సామాజిక బాధ్యత అధికారి నాగరాజు, సిబ్బంది నరసింహారావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.