ప్రజాశక్తి-కాకినాడ ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులకు అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా మహిళాభివద్ధి, శిశుసంక్షేమం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు పని చేయాలని కలెక్టర్ డాక్టర్ కతికా శుక్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ కతికా శుక్లా జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. సుస్థిర అభివద్ధి లక్ష్యాలు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కోవిడ్ పరీక్షలు, ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్, ఫీవర్ సర్వే, ఎన్సీడీ సర్వే వివరాలు, పారా మెడికల్ సిబ్బంది, వైద్యుల నియామకం, మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి అంగన్‌వాడీ భవనాల పురోగతి, పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన డ్రాపౌట్స్, జగనన్న విద్యా కానుక, మన బడి నాడు-నేడు, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన, గడప గడపకూ మన ప్రభుత్వం అర్జీల పరిష్కారం, ఇతర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టరు కతికా శుక్లా అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత అంశమైన సుస్థిర అభివద్ధి లక్ష్యాల సాధనకు అధికారులు ప్రత్యేకంగా చొరవ చూపాలన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులకు అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా అమలయ్యే విధంగా మహిళా అభివద్ధి శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా గర్భిణులు, చిన్నారులు, 6 నుంచి 19 ఏళ్ల పిల్లల వివరాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం కొరత లేకుండా సకాలంలో అందేలా చూడాలన్నారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు సంబంధించి పనులు వేగవంతం చేయాలని, మరమత్తులకు అనుమతులు మంజూరైన చోట పనులు వెంటనే మొదలుపెట్టాలని ఆదేశించారు. ఐపాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేసరికి మనబడి-నాడు నేడు కింద చేపట్టిన పనులు పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిపిఒ పి.త్రినాథ్, డిఇఒ కెఎన్‌విఎస్.అన్నపూర్ణ, ఇన్‌ఛార్జి డిఎం అండ్ హెచ్‌ఒ డాక్టర్ కె.సత్యనారాయణ, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ పి.రాధాకష్ణ, ఐసిడిఎస్ పీడీ కె.ప్రవీణ, సోషల్ వెల్ఫేర్ జేడీ జె.రంగలక్ష్మీదేవి పాల్గొన్నారు.










