Sep 03,2023 22:34

ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం నెల్లూరు రూరల్‌ మండల కార్యదర్శి ఆలూరి తిరుపాలు

సమరభేరి జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి-నెల్లూరు : 4వ తేదీ జరుగుతున్న సమరభేరి కార్యక్ర మాన్ని జయప్రదం చేయాలని సిపిఎం నెల్లూరు రూరల్‌ మండల కార్యదర్శి ఆలూరి తిరుపాలు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పాత వెల్లంటి గ్రామంలోని యువకులతో జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన అధిక ధరలను, విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, మండలంలోని రోడ్లు డ్రెయినేజీ కాలువలు మంచినీటి సమస్య లాంటి మౌలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమరభేరి కార్యక్రమం లో భాగంగా సెప్టెంబర్‌ 4వ తేదీ సోమవారం విఆర్సి గ్రౌండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన జరుగుతుందన్నారు.
అనంతరం జరుగుతున్న ధర్నాలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పల్లవరపు చెంచయ్య, పి.సుబ్ర హ్మణ్యం, ఎస్‌కె.అమీర్‌భాషా, పి.మస్తాన్‌, పి.మధు, పి.మస్తానయ్య, వెంకట రమణయ్య, పి.పెంచల య్య, అంజయ్య, పి.మదన్‌ తదితరులున్నారు.