నివాళి అర్పిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు దిశాలి అని ఎంపిపి ఉప్పల స్వ ర్ణలత పేర్కొన్నారు. బుధవారం ఎంపిడిఒ కార్యాల యంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు జరిగాయి. ఎంపిడిఒ కన్నం హేమలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపిపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందరభంగా స్వర్ణలత మాట్లాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్, ఇఓ పిఆర్డి నారాయణ రెడ్డి, కార్యా లయం సిబ్బంది పాల్గొన్నారు.










