ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో గెలుపే లక్ష్యంగా జనసేన, తెలుగుదేశం కలిసి పని చేస్తామని టిడిపి అర్బన్ ఇన్‌ఛార్జి ప్రభాకర్‌చౌదరి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని శ్రీ 7 కన్వెన్షన్ హాల్‌లో జనసేన, టిడిపి ఆత్మీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి మేనిఫెస్టో 'భవిష్యత్తుకు గ్యారెంటీ' అనే కార్యక్రమం మొదలవుతుందన్నారు. అలాగే ఓటర్ల జాబితాలో అక్రమాలపై, రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరాటం చేయనున్నట్లు తెలిపారు. అన్నివర్గాల ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా రాక్షస వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన, టిడిపి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎక్కడైనా కార్యకర్తలకు సమస్యలు ఎదురైతే సమన్వయం చేసుకుని పరిష్కరిస్తామన్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుల పర్యటనలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సృష్టిస్తున్న అడ్డంకులను ఖండిస్తూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి నాయకులు పొదిలి బాబురావు, భవాని రవికుమార్, పెండ్యాల శ్రీలత, మురళీకృష్ణ, జయరామ్‌రెడ్డి, మారుతి, అంకే ఈశ్వరయ్య, కుమ్మర నాగేంద్ర, సంజీవరాయుడు, రాపా ధనుంజరు, కిరణ్‌కుమార్, జయమ్మ, విజరుకుమార్, ముప్పూరు కృష్ణ, సదానందం, గ్రంధి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, మేదర వెంకటేష్, రోళ్ల భాస్కర్, వెంకటనారాయణ, చక్రపాణి, దరాజ్ బాషా, నగర కార్యదర్శులు కుమ్మర మురళి, లాల్‌స్వామి, సంపత్, వెంకటనారాయణ, ఆకుల అశోక్, ఆకుల ప్రసాద్, వీరమహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.