Oct 06,2023 22:55

కమిటీ సభ్యులను అభినందిసుఓ్తన్న నేదురుమల్లి

సమన్వయంతో పోలేరమ్మ జాతర సక్సెస్‌ : నేదురుమల్లి

ప్రజాశక్తి - వెంకటగిరి
సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగ హోదాలో ఈ ఏడాది వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మతల్లి జాతరను విజయవంతంగా అందరి సమన్వయంతంగా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి వెల్లడించారు. నేదురుమల్లి నివాసంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మతల్లి జాతర శాంతికమిటీ మెంబర్లతో సమీక్షించారు. అనంతరం అమ్మవారి కండువాతో సత్కరించి పోలేరమ్మ తల్లి చిత్రపటం ప్రసాదాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వడ్డిపల్లి చంగయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సివి రమణయ్య, కమిటీ సభ్యులు ఢిల్లీ బాబు, కోటేశ్వరరావు, పాపారావు, జై ప్రకాష్‌ జెట్టి పాల్గొన్నారు.
కమిటీ సభ్యులను అభినందిసుఓ్తన్న నేదురుమల్లి