Nov 17,2023 19:57

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి - హాలహర్వి
మండలంలోని ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటు పడాలని ఎంపిపి నెట్టికంటమ్మ కోరారు. శుక్రవారం ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి అధ్యక్షతన ఎంపిడిఒ ఆంతోని ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. అధికారులు ప్రగతి నివేదికను చదివి వినిపించారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేస్తామని ఎంపిడిఒ ఆంతోని హెచ్చరించారు. ఎఒ శివశంకర్‌ మాట్లాడుతూ... పిఎం కిసాన్‌ రూ.2 వేలు రైతుల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. రైతు భరోసా కొద్ది రోజుల్లో పడతాయన్నారు. జడ్‌పిటిసి లింగప్ప, వైస్‌ ఎంపిపి నాగేష్‌, వెటర్నరీ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.