Aug 15,2023 21:16

అట్‌ హోమ్‌ కార్యక్రమంలో జిల్లా అధికార యంత్రాంగంతో కలెక్టర్‌, ఎస్‌పి, జెసి

రాయచోటి/రాయచోటి టౌన్‌ : సమన్వయంతో జిల్లా యంత్రాంగమంతా జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ గిరీష అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్‌ బంగ్లాలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కన్నుల పండువగా అట్‌ హోమ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరంలో ఆయా శాఖల వారీగా అభివద్ధి ఫలాలు సమద్ధిగా సిద్దించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లాను అభివద్ధిలో ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు మరింత మెరుగైన ప్రణాళికలతో సమర్థవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు. శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ ఫలాలు అందించేందుకు అధికారులు అందరూ బాధ్యతాయుతంగా కషి చేయాలని కోరారు. జిల్లా అభివద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సహకారంతో పని చేయాలని తెలిపారు. రాబోవు రోజుల్లో అన్నమయ్య జిల్లాకు ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని అధికారులను కోరారు. ఎస్పీ గంగాధర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖలు ఒక మంచి అవగాహనతో సమన్వయంగా జిల్లా అభివద్ధి కషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేరడ్‌ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన అధికారులందరినీ అభినందించారు. అట్‌ హోమ్‌ ఒక మంచి కార్యక్రమం జిల్లా స్థాయి అధికారులు అందరూ పాల్గొని ఉల్లాసంగా గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేలు ప్రతి టేబుల్‌ వద్దకు వచ్చి అధికారులను ఆత్మీయంగా పలకరిస్తూ ఉల్లాసంగా గడిపారు. అట్‌ హోమ్‌ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఆర్‌డిఒలు రంగస్వామి, మురళి, రామకృష్ణారెడ్డి, డిఆర్‌డిఎ, డామ్వా పీడీలు మద్దిలేటి, సత్యనారాయణ, పట్టు పరిశ్రమ శాఖ జెడి రాజశేఖర్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ డిఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ ప్రసన్న కుమార్‌, సమాచార శాఖ డిఐపిఆర్‌ఒ భరత్‌ కుమార్‌రెడ్డి, డిపిఆర్‌ఒ పురుషోత్తం, పిఆర్‌ఒ ధర్మా నాయక్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.