May 06,2023 00:29

అవగాహన కల్పిస్తున్న రమాప్రభ


ప్రజాశక్తి- అరకులోయ:స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో గిరి బాల నేస్తం చిల్డ్రన్స్‌ క్లబ్‌ జిల్లా వర్క్‌ షాప్‌ సమ్మర్‌ క్యాంపు శుక్రవారం ప్రారంభమైంది. రోటరీ క్లబ్‌, ఆసరా చారిటబుల్‌ సొసైటీ సహకారంతో ఈ నెల 5, 6వ తేదీలలో జరుగుతున్న ఈ వర్క్‌ షాప్‌ లో ఆంధ్ర ప్రదేశ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ పిల్లలకు ఆటపాట నేర్పించడమే కాకుండా క్యాంప్‌ ఉపయోగంపై మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో విద్య, వైద్య పరంగా వెనుకబడిన గిరిజన విద్యార్థులకు విజ్ఞానం, వినోదం, వికాసం పెంపొందించడానికి గిరి బాల నేస్తం ఆధ్వర్యంలో 3 సంవత్సరాల నుంచి జిల్లాలో గిరి బాల నేస్తం చిల్డ్రన్స్‌ సమ్మర్‌ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. నైపుణ్యాన్ని, సజనాత్మకతను వెతికి తీసే బొమ్మలను తయారు చేయడం, కమ్యూనికేషన్‌ స్కిల్ల్స్‌ పెంచుతూ గిరి బాల నేస్తం గిరిజన ప్రాంతంలో విజ్ఞానం, వినోదం, వికాసం పెంచడం జరుగుతుందన్నారు.
గిరి బాల నేస్తం జిల్లా కన్వీనర్‌ వివి జయ మాట్లాడుతూ, ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పిస్తారని ఆమె అన్నారు. నైపుణ్యాన్ని సజనాత్మకతను వెలికి తీసే బొమ్మలను తయారు చేయడమే కాకుండా, డ్రాయింగ్‌, కథలు, కవితలు న్యూస్‌ చదవడం దీనిలో ఒక భాగం అన్నారు. టీవీలకు, మొబైల్‌కు హత్తుకుపోయే పిల్లలకు ఈ క్యాంపులు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో గిరి బాల నేస్తం జిల్లా నాయకులు పి కుమారి, ఎస్‌. నాగేంద్ర, ఏం.చిట్టిబాబు, మోనీత్‌, దేవదాసు, రాధిక, సంధ్య, మీనా, విద్యార్థిని, విద్యార్థులుపాల్గొన్నారు.