May 08,2023 00:08

మాట్లాడుతున్న పాఠశాల విద్యా కమిషనర్‌ సురేష్‌కుమార్‌

ప్రజాశక్తి-భీమునిపట్నం : సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ డైట్‌ విద్యార్థులకు సూచించారు. స్థానిక ప్రభుత్వ డైట్‌ను ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రతాపరెడ్డితో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా డైట్‌లను బలోపేతం చేయనున్నామని తెలిపారు. ప్రతి డైట్‌ కూడా ఏదైనా సందర్భంలో తన ప్రత్యేకతను చాటుకోవాలన్నారు. విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇంఛార్జి రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ బి.లింగేశ్వరరెడ్డి, డిఇఒ ఎల్‌.చంద్రకళ, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరావు, డిప్యూటీ డిఇఒ గౌరీ శంకర్‌, ప్రిన్సిపల్‌ యు.మాణిక్యంనాయుడు, వైస్‌ ప్రిన్సిపల్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.