May 02,2023 23:54

మాట్లాడుతున్న వెలుగు ఎపిఎం నాయుడు

ప్రజాశక్తి-చింతూరు
ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ సిస్టమ్‌ (ఐఎఫ్‌ఎస్‌), ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ క్లస్టర్‌ (ఐఎఫ్‌సి) (సమీకత వ్యవసాయం)పై ఎంఎస్‌ఎఫ్‌పిఓ డైరెక్టర్లకు, రైతు సంఘం లీడర్లు, సిబ్బందికి మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం నాయుడు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికీ 5 నుండి 10 వ్యవసాయ, అనుబంధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా బలోపేత చేయడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చదలవాడ, కొత్తపల్లి గూడూరు పంచాయతీలు ఒక ఐఎఫ్‌సి క్లస్టర్‌గా ఎంపిక చేసుకొని తీర్మానం చేయటం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం స్వామినాయుడు, ఆర్‌వైఎస్‌ఎస్‌ వెంకటేష్‌, ఎపిఒఎన్‌, ఆర్‌జిఎస్‌, విఎఎస్‌, వెలుగు సిసిలు పాల్గొన్నారు.