Dec 08,2022 22:50

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
               సమగ్ర వ్యవసాయ విధానంతో రైతులకు ఆర్థికాభివృద్ధి కలుగుతుందని సిటిఆర్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ మాగంటి శేషుమాధవ్‌ అన్నారు. జీలుగుమిల్లి సిటిఆర్‌ఐలో రైతులకు గురువారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరైతు సమగ్ర వ్యవసాయ విధానంతో పంటలు పండించడం వల్ల రైతుకు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తాడన్నారు. అనంతరం చిన్న సన్న కారు రైతులకు పశువుల పెంపకం వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం ఎస్‌సి సబ్‌ ప్లాన్‌ ప్రకారం పలువురు రైతులకు పశువుల దాణా అందించారు. ఈ కార్యక్రమంలో సైంటిస్ట్‌ సుబ్బయ్య, సరళ, ఫార్మ్‌ మేనేజర్‌ జయకృష్ణ, అసిస్టెంట్‌ మేనేజర్‌ రమేష్‌, సింహాచలం, ప్రభు పాల్గొన్నారు.