ప్రజాశక్తి-కందుకూరు : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తును దష్టిలో ఉంచుకుని సమగ్ర వార్షిక ప్రణాళిక సిద్ధం చేయాలని మండల విద్యా శాఖాధికారులు ప్రసాదరావు, కె సుబ్బారెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక ఎంఇఒ కార్యాలయంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అభివద్ధి ప్రణాళికలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 2024-25, 2025-26లలో పాఠశాల అభివద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు విద్యార్థుల ప్రగతికి అవసరమైన వార్షిక ప్రణాళికలను జాగ్రత్తగా తయారు చేయాలని సూచించారు. అనంతరం రిసోర్స్ పర్సన్లు ఎంవి మాల్యాద్రి, ఎంవి రమణారెడ్డి అభివద్ధి ప్రణాళికలు గురించి ప్రధానోపాధ్యాయులకు సవివరంగా వివరించారు.