ప్రజాశక్తి నర్సీపట్నం రూరల్:శాశ్వత భూ హక్కు పత్రాలు జారీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఇందు నిమిత్తం భూముల రీ సర్వేను చేపడుతుందని నర్సీపట్నం మండల డిప్యూటీ తహసిల్దార్ బి.సత్యనారాయణ తెలిపారు. మండలంలోని గబ్బడ రెవెన్యూ పరిధిలోని రెట్టవానిపాలెంలో వైయస్సార్ జగనన్న భూ హక్కు -భూ రక్ష రీ సర్వేను ప్రారంభించారు. అనంతరం రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలకరికి 2 వేల గ్రామాల్లో, మే నెలాఖరు నాటికి 4 వేల గ్రామాల్లో రీ సర్వే పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చిందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, గ్రామకంఠాల సర్వే, డూప్లికేట్ రికార్డులు, భూ వివాధాల పరిష్కారమే లక్ష్యంగా సమగ్ర సర్వే చేస్తుందన్నారు. రీ సర్వే పూర్తయిన భూ యజమానులకు త్వరలోనే భూ హక్కు పత్రాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, విఆర్‌ఓ సింహాచలం, సర్వే బందం బి. క్రాంతి లతోపాటు ఎంపిటిసి సభ్యు రాలు మాకిరెడ్డి తాతమ్మ ,గబ్బడ సచివాలయ కన్వీనర్లు మాకిరెడ్డి సన్యాసినాయుడు ,మాకిరెడ్డి వెంకట నాగలక్ష్మి ,మాజీ సర్పంచ్ మాకిరెడ్డి పోతురాజు నాయుడు, సన్యాసినాయుడు వెంకీ నాయుడు వైయస్సార్ సేవాదళ్ ప్రతినిధి నానాజీ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.










