ప్రజాశక్తి - వేపాడ : విజయవాడలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరాహార దీక్షకు మద్ద తుగా స్థానిక ఎంఇఒ కార్యాలయం వద్ద ఉద్యో గులు సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను రెగ్యు లర్ చేయాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని కోరారు. పిఆర్‌సి ప్రకారం ఎంటిఎస్, డిఎ, హెచ్‌ఆర్‌ఎ అమలు వచ్చేసి వేతనాలు పెంచాలన్నారు. ఏపీ సమగ్ర శిక్ష ఫెడరేషన్ యూనియన్ ఆదేశాల మేరకు నిరసన చేపడుతున్నామన్నారు.
పూసపాటిరేగ : ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులు సోమవారం విధులకు హాజరు కాకుండా కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి తన పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారని తెలిపారు. తమకు కనీస వేతన స్కేలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం కుంటిసాకులు చూపిస్తొందని ఆవేదన వ్యక్తం చేసారు. వేతనాలు సకాలంలో అందేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ కార్యాలయ సిబ్బంది, పాల్గొన్నారు..










