సమగ్ర భూ సర్వే గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్న తహశీల్దార్ బి వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-చెరుకుపల్లి: సమగ్ర భూ సర్వే ద్వారా భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించడం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని మండల పరిషత్ ఉపాధ్యక్షులు పైన రంగారెడ్డి అన్నారు. సమగ్ర భూ సర్వే పై పొన్నపల్లి సచివాలయంలో శుక్రవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు పైనం రంగారెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో తహశీల్దారు మాట్లాడుతూ జూలై 31వ తేదీ నుంచి పొన్నపల్లి గ్రామంలో భూముల హద్దులు గుర్తించి హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండల సర్వేయర్ రామచందర్రావు రైతులకు భూముల హద్దుల గురించిన అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జానకిరామయ్య, నాయకులు డి శ్రీనివాసరెడ్డి, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.










