Sep 17,2023 00:09

సమగ్ర ఆరోగ్య పరిరక్షణలో హోమియో పరిశోధనలు కీలకపాత్ర

సమగ్ర ఆరోగ్య పరిరక్షణలో హోమియో పరిశోధనలు కీలకపాత్ర
శాస్త్రవేత్త డాక్టర్‌ శివప్రసాద్‌
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌ : సమగ్ర ఆరోగ్య పరిరక్షణ లో హోమియో పరిశోధన ల పాత్ర ఎంతో కీలకమైందని, ఆయుష్‌ హోమియో పరిశోధనా కేంద్రం శాస్త్ర వేత్త డాక్టర్‌ శివప్రసాద్‌ అన్నారు. స్థానిక కెకెసి హోమియో కళాశాలలో జరిగిన మొదటి సంవత్సరం హోమియో విద్యార్థుల ఫ్రెషర్స్‌ డే కళాశాల చైర్మన్‌ కె కుప్పయ్య శెట్టి, వైస్‌ చైర్మన్‌ నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథి మాట్లాడుతూ హోమియో వైద్య రంగంలో జరుగుతున్న పరిశోధ నలు ప్రజారోగ్య పరిరక్షణ లో కీలక పాత్ర వహిస్తున్నాయని ఇది ఎంతో ఆహ్వానించదగిన పరిణామమని అన్నారు. హోమియో విద్యార్థులు కూడా పరిశోధనల పై ఆసక్తి చూపాలన్నారు. క్యాన్సర్‌, మధుమేహంతో పాటు ఇటీవలి కరోనా మహమ్మరిని అరికట్టడం లో హోమియో మందులు ఎంతో ఉపయుక్తంగా నిలిచాయని అన్నా రు.తద్వారా హోమి యో వైద్య సేవలు మరింత ప్రాచుర్యం పొందయని అన్నారు. హోమియో విద్యార్థులు అన్ని కీలక వైద్య పాఠ్యం శాలపై పట్టు సాధించినపుడే ఉత్తమ ,విజయవంతమైన వైద్యులు గా పేరుపొందవచ్చన్నారు. యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ర్యాంకు లు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో,మంజుల రవి శేఖర్‌,వైష్ణవి, హోమియో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శరవణన్‌, సలహాదారు హరనాథ్‌ శెట్టి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, హోమియో విద్యార్థులు పాల్గొన్నారు .