ప్రజాశక్తి - ఆచంట
ఆచంట గ్రామానికి చెందిన రిటైర్డ్ సైంటిస్ట్, స్మెక్ స్కూల్ వ్యవస్థాపకులు, కో-అపరే టివ్ సొసైటీ మాజీ ఉపాధ్యక్షులు, డాక్టర్ సి.సుబ్బా రావు భార్య చిలుకూరి సత్యవతి(82) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ నిజాంపేటలో ఆమె కుమార్తె నివాసం వద్ద అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు భర్త సుబ్బారావు, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మృతి పట్ల సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కేతా గోపాలన్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్‌కుమార్, టిడిపి నాయకులు తమ్మినీడి ప్రసాద్, గొడవర్తి శ్రీరాములు, వెలిచేటి మోహన్‌రావు, వెలిచేటి భరద్వాజ, వైట్ల శ్రీను, ప్రేమ్‌కుమార్, సిపిఎం మండల నాయకులు కార్యకర్తలు, స్మెక్ స్కూల్ సిబ్బంది సంతాపం తెలిపారు. సత్యవతి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు










