May 28,2023 01:10
సమావేశపు హాలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బలరాం

ప్రజాశక్తి-చీరాల: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఆధునీకరించిన సమావేశ హాలును చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ బాబుతో కలిసి శనివారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశ హాలు సమావేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు. ఈ హాలును మండల రెవెన్యూ అధికారులు అందరూ సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సరోజిని, తహశీల్దారు ప్రభాకర్‌రావు, ఎంపీడీవో నేతాజీ, అర్బన్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ గవిని శ్రీనివాసరావు, ఆర్‌బికే చైర్మన్‌ కావూరి రమణారెడ్డి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు, బుర్ల సాంబశివరావు, బోయిన కేశవులు,నాదెండ్ల కోటేశ్వరరావు, బుర్ల మురళి, గుంటూరు వెంకట సుబ్బారావు, షేక్‌ మస్తాన్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.