ప్రజాశక్తి - ఉంగుటూరు
అమెరికాలో స్థిరపడిన కైకరం పాఠశాల పూర్వ విద్యార్థి తాను చదివిన పాఠశాలలో విద్యా బోధనకు సాంకేతికతను జోడించాలనే సంకల్పంతో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. కైకరానికి చెందిన పూర్వ విద్యార్థి సనపల రామకృష్ణ తాను చదివిన పాఠశాలకు రూ.20 లక్షలు సొంత నిధులు సమకూర్చి, కోట్స్ సంస్థ ద్వారా కంప్యూటర్ ల్యాబ్, ఐదు డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశారు. శనివారం వీటి ప్రారంభోత్సవం సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం టివి.రామకృష్ణ అద్యక్షతన జరిగిన సభలో పలువురు మాట్లాడుతూ పాఠశాలలో దాతలు, ప్రజాప్రతినిధులు, స్థానికుల తోడ్పాటుతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు జెడ్‌పిటిసి కొరిపల్లి జయలక్ష్మి, మానవత సంస్థ రీజనల్ ఛైర్మన్ పుప్పాల గోపీ, కోట్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జి.అప్పారావు, ఎమ్‌డి.కృష్ణారావు, పి.విష్ణుమూర్తిరామ్, పాఠశాల పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ శానం లక్ష్మణరావు, కొంపల్లి శ్రీనివాసరావు, సభ్యులు కానే వీర వెంకట సత్యనారాయణ, కొకుమారి నాగమణి, కొల్లాబత్తుల నాగరాజు, మార్పిన రాము, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










