Oct 29,2023 23:27

రాంబాబును సన్మానిస్తున్న దృశ్యం


ప్రజాశక్తి-గిద్దలూరు
దసరా పండుగను పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం ఆధ్వర్యంలో కుసుమ హరనాథ మందిరంలో ఏర్పాటు చేసిన సమారాధన మహోత్సవంలో స్థానిక శాసన సభ్యులు అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఆలయంలో శ్రీ వాసవి మాత దర్శనం చేసుకొని ఆశీర్వదాలు పొందారు అలాగే అక్కడ ఏర్పాటు చేసిన తులాభారం, అనంతరం మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా పాల్గొన్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు, నిర్వహకులు, ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించి భారీ గజమాలతో సత్కరించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కోటా శ్రీనివాసులు, వాడకట్టు సత్యనారాయణ, గర్రె సుబ్బారావు మరియు పలువురు వైసీపీ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే అన్నా