Jun 22,2023 00:48

ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేస్తున్న కాంట్రాక్ట్‌ , ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

సత్తెనపల్లి రూరల్‌: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమానపనికి సమాన వేతనంతో పాటు టైమ్‌ స్కేల్‌ అమలు చేయాలని దాని యూనియన్‌ అధ్యక్షులు బత్తుల రాజు డిమాండ్‌ చేశారు. సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాల ఎదుట బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బత్తుల రాజు మాట్లాడుతూ జనవరి 2022 నుండి మినిమం టైమ్‌ స్కేల్‌ అమ లుకు ఉత్తర్వులు ఇచ్చిన ప్పటికీ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సిం గ్‌ ఉద్యోగులు సమాన పనికి, సమాన వేతనం అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉద్యోగ సం ఘం ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపి హామీ ఇచ్చి పది నెలలు గడుస్తున్నప్ప టికీ నేటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేద న్నారు. ఒకే క్యాడర్‌ ఒకే వేతనం మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలని కోరుతూ సత్తెనపల్లిలోని ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అంద జేశారు. నేషన్‌ హెల్త్‌ మిషన్‌ డాక్టర్లు, స్టాఫ్‌ నర్స్‌ లు,కౌన్సిలర్‌, ఫిజియోథెరపిస్ట్‌లు పాల్గొన్నారు.