Feb 19,2023 23:49
సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని సన్మానిస్తున్న సాహిత్య సంస్థ ప్రముఖులు

ప్రజాశక్తి-చీరాల: సమాజ సేవ పట్ల బాధ్యత కలిగి ఉంటూ సాంస్కతికంగా సమాజానికి పునరంకితమవు తున్న వారిని సత్కరించుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఆదివారం సహజ సాహిత్య ఆధ్వర్యంలో విద్యా కళాశాలలో పురస్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజావిభో కుందాళ్లం వ్యవస్థాపకులు అప్పజోస్యుల సత్యనారాయణ సాహితీ అధ్యక్షులు వడలి రాధాకృష్ణ పలువురు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో పనిచేయాలని అలాంటి వారిని సమాజం అన్నివేళలా గౌరవిస్తుందని అన్నారు. స్ఫూర్తిశ్రీ పసుమర్తి పార్థసారథిరావు స్మారక సేవా కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి కుమారుడు లయన్‌ పసుమర్తి నరసింహారావుకు ఉత్తమ పురస్కార గ్రహీత డాక్టర్‌ వికె భాస్కర్‌రావుకు ప్రదానం చేశారు. అదేవిధంగా ప్రముఖ సంఘ సేవకులు, విద్యావేత్త, బత్తుల సర్వే ట్రస్ట్‌ బత్తుల బ్రహ్మారెడ్డి సాంస్కృతిక బంధు అనే గౌరవ బిరుదును ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎన్‌ సూర్యప్రకాశరావు, జంపాల గంగాధర్‌ రావు, పనికి చంద్రశేఖర్‌, బత్తుల పాపారావు, గాద హరిహరరావు పాల్గొన్నారు.