
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
ఆదర్శ గురువులకు అవార్డులు
ప్రజాశక్తి - కాళ్ల
ఆదర్శ గురువులు అవార్డులు సొంతం చేసుకున్నారు. కాళ్ల మండలంలో పని చేస్తున్న 11 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సీసలి స్పెషల్ ప్రాథమిక పాఠశాల ఎస్‌జిటి ఉపాధ్యాయుడు బొబ్బిలి రాజమౌళి కోటేశ్వరస్వామి విశాఖపట్నంలో ఎయు కాన్వొకేషన్ హాలులో మంగళవారం జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా అందుకున్నారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును నలుగురు ఉపాధ్యాయులు అందుకున్నారు. మరో ఆరుగురు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. అంకితభావంతో పని చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న పెదఅమిరం మెయిన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు డి.ప్రసన్నభారతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కలెక్టర్ పి.ప్రశాంతి, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, భీమవరం ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ చేతులమీదుగా అందుకున్నారు. వేంపాడు (హిందూ) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెల్లంకొండ నాగ మురళి శ్రీనివాసరావు, బొండాడ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయురాలు కె.విజయశ్రీ, వేంపాడు ప్రాథమిక పాఠశాల (ఎల్‌ఇ) ప్రధానోపాధ్యాయులు విఆర్‌కె.రవికుమార్‌రాజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు.
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీ రింగ్ విభాగంలో ఆచార్యునిగా పని చేస్తున్న కడలి పూర్ణివ శర్మకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా పూర్ణిమను కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంధి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు, ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకరరావు, టెక్నికల్ డైరక్టర్ అప్పారావు, డీన్‌లు డాక్టర్ రాంబాబు, డాక్టర్ నరేష్, వివిధ ఇంజినీరింగ్ విభాగాల అధిపతులు అభినందించారు. దేశ ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని ఎపి నిట్ డీన్ రీసెర్చ్, కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్‌కె.శాస్త్రి తెలిపారు. నిట్ ఇన్‌ఛార్జి డైరెక్టర్ డాక్టర్ ఎం.ప్రమోద్ పడోలే ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్‌శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద ఉపాధ్యాయ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి శాస్త్రి మాట్లాడుతూ విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదేనన్నారు. డీన్‌లు డాక్టర్ టి.కురుమయ్య, డాక్టర్ జిబి.వీరేష్‌కుమార్ మాట్లాడారు. తొలుత రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గణపవరం : మానవత సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో గణపవరం కన్యకా పరమేశ్వర ఉత్సవం సందర్భంగా నిర్వహించిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో మానవత సంస్థ అభివృద్ధి విస్తరణ కమిటీ కన్వీనర్ సాగిరాజు జానకిరామరాజు పాల్గొని మాట్లాడారు. తొలుత పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్.రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రార ంభించారు. అనంతరం ఉపాధ్యాయులు న డపన నాగేశ్వరరావు (విస్సాకోడేరు), కాకర్ల రాజేశ్వరి (ఆకి వీడు), కెవిబి. మరళీకృష్ణ (భీమ వరం), సిబిసి శేఖర్‌రాజు, డివి ఎస్.చంద్రాజి లను స త్కరించా రు. పిప్పర గ్రంథాల యంలో సర్వే పల్లి రాధాకష్ణ చిత్రపటా నికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భం గా పిహె చ్‌సి డాక్టర్ కె.ప్రియా ంక సర్వే పల్లి రాధాకష్ణ జీవిత విశేషాలు వివరించారు. అనంత రం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యా యులను సత్కరించారు. గణపవరం డిగ్రీ కాలేజీలో ప్రిన్సి పల్ పి.నిర్మలాకుమారి అధ్యక్షతన సభ నిర్వహించారు. చాణక్య కాలేజీలో విద్యార్థులకు లియో క్లబ్ ఆధ్యర్యాన వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కాశిపాడులో ఉత్తమ ఉష్పాధ్యాయులను సత్కరించారు.
వీరవాసరం : వీరవారం ఎంఆర్‌కె.జిల్లా పరిషత్ హైస్కూల్‌లో అవార్డు పొందిన పీడీ మల్లేశ్వరావు దంపతులను ప్రధానోపాధ్యాయులు జుత్తిగ శ్రీనివాస్‌ను, జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పాఠశాల ఉపాధ్యాయులు పంపన సాయిబాబు, కుసుమే ఆనందరావు, వై.వెంకటేశ్వరావు, వై.భానుకుమారి, బి.విజయలక్ష్మి, రత్నరాజు, చినబాబు, పెద్దిరాజు, నరసింహరావు, శివకుమార్, పుష్పలత, సుబ్రహ్మ ణ్యంలను విద్యార్థులు సత్కరించారు. రాయకుదురు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయులు కానుకొలను శ్రీనివాసరావును, ఉపాధ్యాయులను సత్కరించారు.
పెనుమంట్ర:సర్వేపల్లి రాధాకృష్ణన్ అడుగు జాడల్లో నడవడమే తమ లక్ష్యమని ఎంఇఒ ఉంగరాల నాగేశ్వరరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా ఎంఇఒ కార్యాలయం వద్ద సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహా నికి నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ వి.పూర్ణబాబ్జి, ఎఎస్‌ఐ వెంకటేశ్వర రావు, మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
పాలకొల్లు : పాలకొల్లు వైసిపి కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి వైసిపి ఇన్‌ఛార్జి గుడాల గోపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆదర్శ ఉపాధ్యాయులు రాయపూడి భవానీప్రసాద్, ఉన్నమట్ల చిన్నయ్యలను ఆయన ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దల గణేష్‌భవాని అన్నారు. పాలకొల్లు జివిఎస్‌వి మున్సిపల్ స్కూలులో గురు పూజోత్సవం సందర్భంగా మంగళవారం పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు త్రిమూర్తులు, శశికళ, చంద్రకళ, భవానిదుర్గ, హెచ్‌ఎం రాయపూడి భవానిప్రసాద్ పాల్గొన్నారు.
ఆకివీడు :జాతి ఔన్నత్యాన్ని పెంపొదించడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, అందుకు పునాదులు వారేనని లయన్స్ జిల్లా మాజీ గవర్నర్, డాక్టర్ ఎంవి.సూర్యనారాయణరాజు అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు, ఆదర్శ లయన్స్ క్లబ్, గోల్డెన్ ఆక్వా లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుని ఎంపిక చేసి సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివి.కృష్ణంరాజు అధ్యక్షతన నిర్వహించిన సభలో సూర్యనారాయణరాజు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులు మంచెం రాధాకృష్ణ, అడపా సుబ్రహ్మణ్యం, గోనుగుల మాల్యాద్రి, జెడ్‌వి.సత్యనారాయణ, టి.సత్యకుమారి, ఎ.పాండురంగారావులను సన్మానించారు.
ఉపాధ్యాయులు ఉత్తమ మార్గాలను అనుసరించాలని, విద్యార్థులు అనుకరిస్తారని డిఇఒ రమణ అన్నారు. స్థానిక సూఫీ కళ్యాణ మండపంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఇఒ రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన సభలో డిఇఒ రమణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ సర్వేపల్లిని ఆ స్థాయికి తీసుకెళ్లాయన్నారు. తహశీల్దార్ ఎం.విజయలక్ష్మి మాట్లాడారు. కాళ్ల, ఆకివీడు మండలాల ఉత్తమ గురువులను సన్మానించారు.
ఉండి: మండల పరిధిలోని పాందువ్వ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మండల కార్యదర్శి మాదాసు గోపీ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోపీ, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా అడ్‌హక్ కన్వీనర్ అరివెల్లి బలరాముడు మాట్లాడారు. అనంతరం గోపి ఆధ్వర్యంలో ప్రధానోపాద్యులు రాజు పర్యవేక్షణలో ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో దవిలి అప్పన్న, ఎస్.గంగయ్య, ఎం.శ్రీరాములు, జి.కాసులు పాల్గొన్నారు.
ఉండి : మండల పరిషత్ ఆధ్వర్యంలో ఎంపిపి ఇందుకూరి శ్రీహరినారాయణరాజు అధ్యక్షతన మండల పరిధిలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు పులిదిండి సత్యం మాట్లాడారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఎం.శివరామరాజు, డి.కుమార్‌స్వామి, డి.రాజేష్, బి.వెంకటఉమాదేవి, కె.శ్రీలక్ష్మి, ఆర్.అన్నమ్మ, జి.విజయలక్ష్మిలను సన్మానించారు.
పాలకొల్లు రూరల్ : మండలంలోని లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు జిబి.ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు.
నరసాపురం టౌన్ : స్థానిక మిషన్ హైస్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు మెమెంటో, ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, ఉపాధ్యాయలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.