Sep 22,2023 22:38

ప్రజాశక్తి-గన్నవరం : సమాజాభివద్ధిలో రోటరీక్లబ్‌ పాత్ర ఎనలేనిదని వికెఆర్‌ కళాశాల మాజీ కరస్పాండెంట్‌ చింతపల్లి సీతారామయ్య అన్నారు. రోటరీక్లబ్‌ ఆఫ్‌ గన్నవరం ఆధ్వర్యంలో దావాజీగూడెంలోని రెండు ఎస్సీ, రెండు బీసీ బాలికల వసతి గృహాల్లోని 150 మంది విద్యార్థినులకు చాపలను అందజేశారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వటం అభినందనీయమన్నారు. పేద విద్యార్థుల చదువుకు ప్రోత్సాహంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందజేస్తున్న రోటరీ క్లబ్‌ అందరికీ ఆదర్శనీయమన్నారు. విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్‌ రాణి మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డుకారాదన్నారు. చదువులో రాణించే వారికి ప్రోత్సాహకాలు వెతుక్కుంటూ వస్తా యన్నారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో వసతి గహాల్లో చదివే విద్యార్థులకు చాపలు అందజేయటం గొప్ప విషయ మన్నారు. రోటరీ క్లబ్‌ అధ్యకులు జాస్తి విజయ భూషణ్‌ కుమార్‌, కార్యదర్శి నర్రా సీతారామారావు, సభ్యులు గన్నే వెంకట్రావు, టీఎస్‌ఆర్కి ప్రసాద్‌, బొప్పన సత్యన్నా రాయణ. రవిబాబు బ్రహ్మం, హాస్టల్‌ వార్డెన్లు పాల్గొన్నారు.