
ప్రజాశక్తి-మాడుగుల:సమాజానికి పాత్రికేయులు ఎంతో అవసరమని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక తులసి కళ్యాణ మండపంలో మాడుగుల ప్రెస్ క్లబ్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సమస్యలు, లోటుపాట్లు వెలుగులోకి తీసుకు వచ్చి సమాజ అభివృద్ధికి మీడియా ప్రతినిధులు శ్రమిస్తున్నారన్నారు. కొందరు పాత్రికేయులు లేని విషయాలు వెలుగులోకి తీసుకు వచ్చి సమస్యలు సృష్టించడం సరి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ పోలి నాయుడు, ఎంపిపి పెదబాబు, సర్పంచ్ కళావతి, వైస్ సర్పంచ్ శ్రీనాథ్ శ్రీనివాసరావు, గోళ్ళవిల్లి సంజీవరావు, డిపిఅర్‌ఓ సాయి బాబా, కర్రి సత్యం, పుప్పాల అప్పలరాజు, దంగటి సూర్యారావు, ఎపియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షులు స్వామి, కార్యదర్శి జోగి నాయుడు, చంద్ర రావు, రామకోటి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు త్రినాథ్, వేణు, సురేష్ సాంతో పాల్గొన్నారు.
రావికమతం:ఏ.పీ.యూ.డబ్ల్యూ.జే మాడుగుల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా రావికమతం మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి ఇల్లపు చిన్న సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ, మాడుగుల ప్రెస్ క్లబ్ పరిధిలోని నాలుగు మండలాల విలేకరుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.