ప్రజాశక్తి - పెద్దాపురం సమాజ వికాసం బాలల్లో ప్రతిబింబించినప్పుడే సమాజం అభివద్ధి చెందుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ చెలికాని స్టాలిన్ అన్నారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 34 రోజులపాటు నిర్వహించిన సమ్మర్ క్యాంపు ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. చదువు, విజ్ఞానం, ఆట, పాట, ఆనందం కలగలిసినదే బాల్యమన్నారు. 34 రోజులపాటు నిర్వాహకుల శ్రమ బాలల ఉరిమే ఉత్సాహంగా వెల్లివిరిసిందన్నారు. సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ జోష్యుల కష్ణ బాబు మాట్లాడుతూ మండు వేసవిలో 34 రోజులపాటు ఈ శిబిరాన్ని నిర్వహించిన వారిని అభినందించారు. కూనిరెడ్డి అరుణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రజానాట్యమండలి కళాకారులు రొంగల వీర్రాజు, దారపరెడ్డి సత్యనారాయణ, మహా పాతిన రాంబాబు, దారపురెడ్డి కష్ణ బందం అభ్యుదయ గీతాలు ఆల పించారు. సమ్మర్ క్యాంపులో రీసెర్చ్ పర్స న్స్‌గా వ్యవహరించిన వారందరినీ అతి ధులు సన్మా నించారు. ఈ సభలో పాణం గిపల్లి వెంకట చలపతిరావు, బి.అనంతరావు, పెద్దిరెడ్డి నరేష్, దేవత రాజేష్ కుమార్, బుద్ధ శ్రీనివాసరావు ప్రసంగించారు. విద్యార్థులందరికీ ముప్పన వీర్రాజు బహుమతులు అందజేశారు. అతిథులకు చలపతిరావు మెమొంటోలు అందజేశారు.
చిల్డ్రన్స్ క్లబ్ గౌరవాధ్యక్షునిగా బుద్దా
అనంతరం పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ నూతన కమిటీ ఎంపికయ్యింది. గౌరవాధ్యక్షునిగా బుద్ధా శ్రీనివాసరావు, అధ్యక్షులుగా కూనిరెడ్డి అరుణ, కార్యదర్శిగా రొంగల అరుణ్ కుమార్, కోశాధికారిగా రవికుమార్, కమిటీ సభ్యులుగా మంజుల, హర్షిత, జ్యోత్స్న, అమత, నమ్రత, మనోజ్, సత్య, అంజలి, పవన్, నేహా లక్ష్మి, మధు, బంగారం ఎంపికయ్యారు.










