Nov 06,2023 00:33

భోజనాలు వడ్డిస్తున్న డీఎస్పీ జనార్ధనరావు తదితరులు

ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకమని తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ 16వ వార్షికోత్సవాలను తెనాలిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులోని శ్రీశివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో అనాధలకు అన్నదానం చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఎస్పీ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ఫెడరేషన్‌ తనవంతు సహాయాన్ని అందించడంతోపాటు అన్నార్తుల ఆకలి తీర్చడం అభినందనీయమన్నారు. బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మగాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు జరిగిన అన్నదాన కార్యక్రమంలో తాలూకా ఎస్‌ఐ సి.హెచ్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సేవాకార్యక్రమాలు చేస్తున్న ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారిని ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సత్కరించారు. అనంతరం ఫెడరేషన్‌ కార్యాలయంలో సీనియర్‌ జర్నలిస్టులు బచ్చు సురేష్‌ బాబు, ఎస్‌ఎస్‌ జహీర్‌ను ఫెడరేషన్‌ సభ్యులు సత్కరించారు. ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు కె.రత్నాకర్‌, డివిజన్‌ కార్యదర్శి డి.కోటేశ్వరరావు, నియోజకవర్గ అధ్యక్షులు అంబటి శ్యామ్‌సాగర్‌, కార్యదర్శి పుట్ట పున్నయ్య, వేమూరు నియోజకవర్గ అధ్యక్షులు ఎం.సుబ్బారావు, జి.ప్రకాశరావు, అచ్యుత సాంబశివరావు, బి.చంద్రమోహన్‌, సభ్యులు వి.లక్ష్మణరావు, ఉనం భూషణరావు, మునిపల్లి శ్రీకాంత్‌, ఎం.ప్రసాద్‌, డి.రవికిరణ్‌, అత్తోట సంజరు, ఎన్‌జె శ్యామ్యూల్‌, ఎం.భాస్కర్‌, కరేటి సాంబశివరావు, యు.కోటేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు, కె.కృష్ణ, బి.ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.