Oct 08,2023 22:03

కార్యక్రమానికి హాజరైన వక్తలు

ప్రజాశక్తి- వత్సవాయి : సమాజ శ్రేయస్సుకోసమే విజ్ఞాన కేంద్రాలున్నాయని సిఐటియు రాష్ట్ర నాయకులు డివి కృష్ణ అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రజలకు సేవ చేస్తూ విద్యా, ఉపాధి, సాంస్కతిక, రంగాల్లో శిక్షణ ఇస్తూ ముందుకు వెళ్తున్నాయని ఆయన అన్నారు. వత్సవాయి మండల కేంద్రంలో బొగ్గవరపు వెంకటేశ్వర్లు విజ్ఞాన కేంద్రం బివివికె భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో స్థల దాతలు డాక్టర్‌ పులిపాటి చంద్రశేఖర్‌, పుష్పవతి దంపతులు శిలాఫలకం ఆవిష్కరించారు. ట్రస్ట్‌ చైర్మన్‌ సిహెచ్‌ హనుమంతరావు అధ్యక్షతన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో డివి.కృష్ణ మాట్లాడారు. యువతీ ,యువకులకు స్వయం ఉపాధి కోసం విజ్ఞాన కేంద్రం పనిచేస్తుందని ఇటువంటి నిర్మాణానికి ప్రజలందరూ మనిషి, మనిషికి ఒక ఇటుక తెచ్చి నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు. స్థలదాతలైన పులిపాటి చంద్రశేఖర్‌, పుష్పవతి దంపతులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బొగ్గవరపు వెంకటేశ్వర్లు కుమారుడు హనుమంతరావు, విజయలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. అనంతరం బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం బాధ్యులు క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ కులమతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు వైశ్యమ్యాలకు, అసమానతులకు అతీతంగా విజ్ఞాన కేంద్రం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా సిహెచ్‌.హనుమంతరావు మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రానికి సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజానికి ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొని సహాయ సహకారాలు సూచనల సలహాలు అందించాలని కోరారు. ట్రస్ట్‌ కమిటీ సభ్యులు బొగ్గర వెంకట రాజారావు మాట్లాడుతూ సమాజానికి ఇటువంటి ఆ విజ్ఞాన కేంద్రం అవసరం ఉందని తెలిపారు. ట్రస్ట్‌ కమిటీ సభ్యులు బి.రాము మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ కమిటీ సభ్యులు ఎం.చంద్రశేఖర్‌, టి.రమేష్‌ బి.రాము, కె.వెంకటేశ్వర్లు, వత్సవాయి ఎంపీపీ కే.రమాదేవి భూక్య రాజా, కే.వెంకటేశ్వర్లు టి.రాంబాబు కే.కొండయ్య, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు సిహెచ్‌ సైదులు, జి.రామారావు, కె.వెంకటేశ్వర్లు జి.వెంకటేశ్వర్లు,షేక్‌.నగుల్‌ మీరా, పి.కోటేశ్వరరావు కే.పటేల్‌, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సాయం అందించిన దాతలందరినీ ట్రస్ట్‌ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు.