సమాజ సేవలోనే సంతృప్తి : టిడిపి
మండల టిడిపి కన్వీనర్ ఎల్ల నాగయ్య
ప్రజాశక్తి - బేతంచర్ల
సమాజ సేవ చేయడంలోనే సంతృప్తి ఉందని బేతంచర్ల మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఎల్ల నాగయ్య, బేతంచెర్ల పట్టణ కార్యదర్శి షేక్షావలి చౌదరి అన్నారు. బేతంచర్ల మండలం కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వికలాంగులకు సుమారు లక్ష రూపాయలు విలువ చేసే నాలుగు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్ల నాగయ్య, షేక్షావలి చౌదరీలు మాట్లాడుతూ వికలాంగుల పట్ల జాలి, దయ చూపడం కాకుండా వారికి సహాయం చేసి ప్రత్యక్షంగా ఆదుకోవడంలో ఎంతో సంతృప్తినిస్తుందని వారు అన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమాజసేవలో నాయకులు, కార్యకర్తలు ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర చౌదరీ, రవీంద్ర నాయక్, డాక్టర్ మస్తాన్ వలి, సిమెంట్ నగర్ రాముడు, మద్దిలేటి, వాసు, శివుడు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










