Dec 28,2022 23:51

యానిమల్‌ హౌస్‌ ప్రారంభోత్సవంలో గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌

ప్రజాశక్తి -మధురవాడ : బోధనతో పాటు శాస్త్ర పరిశోధనలకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం అధిక ప్రాధాన్యతనిస్తుందని,సమాజహిత పరిశోధనలను ప్రోత్సహించాలన్నదే లక్ష్యమని గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌ అన్నారు. పరిశోధనా ఫలితాల అధ్యయనానికిి విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన యానిమల్‌ హౌస్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గీతం వర్సిటీ విసి దయానంద సిద్దవటం మాట్లాడుతూ ఎథిక్స్‌ కమిటీ పర్యవేక్షణలో గీతం యానిమల్‌ హౌస్‌లో అధ్యయనాలు నిర్వహిస్తామన్నారు. శాస్త్రపరిశోధనల ప్రోత్సాహానికి గీతంలో ప్రయోగశాలలను రూ.50 కోట్లతో ఆధునికీకరిస్తున్నామన్నారు. బయోనెస్ట్‌, అటల్‌ లాబ్‌ల ఏర్పాటుకు ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నామన్నారు. . పరిశోధనలతో బోధన స్థాయి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పేటెంట్లకు గీతం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎమ్‌. గంగాధరరావు, గీతం ప్రోవిసిలు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వారియర్‌, వై. గౌతమ్‌రావు, జిమ్‌సర్‌ ప్రోవిసి డాక్టర్‌ బి.గీతాంజలి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌, ఫార్మశీ డీన్‌, ప్రిన్సిపాల్‌ పి. రామారావు, జిమ్‌సర్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.జ్యోతిపద్మజ, ఫార్మశీ కళాశాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.