Nov 09,2020 08:39

అనగా అనగా ఒక పెద్ద అడవి ఉంది. అందులో అన్నిరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. ఆ అడవిలో అన్నింటికన్నా ఒక మిడత చాలా తెలివి కలది. అది ఆపదలో ఉన్న జంతువులకు సలహాలు ఇస్తూ ఉంటుంది. ఆ సలహాలతో అవి అపాయాల నుండి బయటపడుతూ ఉంటాయి. అదే అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ చెట్టు నిండా కాకి గూళ్లే. ఆ చెట్టు కింద పుట్టలో ఒక పాము ఉంది. ఆ పాము రోజూ రావి చెట్టు పైకి ఎక్కి, కాకి గుడ్లను, కాకి పిల్లలను తింటూ ఉంటుంది.
మిడత సలహాల సంగతి తెలిసి వెంటనే కాకి మిడత దగ్గరకు వెళ్ళింది. 'పాము నా గుడ్లను తినేస్తున్నది. దాని బారి నుండి కాపాడవా?!' అని మిడతను వేడుకొంది.
అప్పుడే అక్కడికి వచ్చిన మిడత మిత్రురాలు సాలీడుని కాకికి మంచి సలహా ఇవ్వమని కోరింది.
అది 'అడవిపంది పుట్టను తవ్వగలదు. వెళ్లి సాయం అడుగు!' అంది.
వెంటనే కాకి అడవిపంది దగ్గరకు వెళ్ళి. దీనంగా తన బాధనంతా చెప్పింది. అడవిపంది సరేనని వచ్చి, పుట్టను తవ్వింది.
పుట్ట నుండి పాము బయటికి వచ్చి పారిపోవడానికి ప్రయత్నించింది. ఆకాశంలో ఎగురుతున్న గ్రద్ద పామును చూసి, తన కాళ్ళతో తన్నుకొని పోయి, కొండపై పెట్టుకుని తినేసింది.
దానితో పాము పీడ విరగడైంది.
కాకి సంతోషించింది.. కాకి వెళ్లి సలహాల మిడతకు, దాని మిత్రురాలు సాలీడుకి కృతజ్ఞతలు తెలియజేసింది.
 

- వి. పవన్‌కుమార్‌,
8వ తరగతి, జిల్లా పరిషత్‌ హైస్కూలు, పెనుమాక.