ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని అరుకు వారపు సంతలో యూనిట్ ఫర్ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివాసి విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫారం, నోట్ బుక్స్, పెన్నులు, బూట్లను ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంధ్ర చేతుల మీదుగా పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరి నిరుపేద, అనాధ బాల, బాలికలకు సుమారు 40 మందిని దత్తత తీసుకొని ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఫీజులు చెల్లించి చదివిస్తున్న ట్రస్ట్‌ను ఆయన అభినందించారు. దీంతోపాటు తల్లిపాలు అందని అనేకమంది చిన్నారులకు ఉచితంగా పాల డబ్బాలను ఈ ట్రస్ట్ అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరకులోయ మయూరి రాజు, ట్రస్ట్ సభ్యులు నీలి జోఫ్సిన్, నీలి నారాయణరావు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.










