Sep 13,2023 21:01

మాట్లాడుతున్న కలెక్టర్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌
సక్రమంగా ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ
ప్రజాశక్తి-నెల్లూరు:ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం జిల్లాలో సక్రమంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ పేర్కొన్నారు.బుధవారం సాయంత్రం కలెక్టర్‌ ఛాంబర్‌ లో జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణ పై వారాంతపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో గుర్తించిన, పెండింగ్‌ లో ఉన్న అన్ని ఓటరు క్లెయిములు, అభ్యంతరాలను పరిష్కరిస్తున్నామన్నారు. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.
ఎన్నికల కమిషన్‌ వారి ఆదేశాల మేరకు తప్పులకు తావులేని, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.అదేవిధంగా రేషనలైజేషన్‌ ప్రక్రియ పై సూచనలు ఉంటే వెంటనే అందజేయాల్సిందిగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.ఈ సందర్బంగా సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నదని ప్రశంసించారు.ఈ సమావేశంలో డి ఆర్‌ ఓ వెంకట నారాయణమ్మ, వైసిపి ప్రతినిధి మందల వెంకట శేషయ్య, టిడిపి ప్రతినిధి భువనేశ్వర ప్రసాద్‌, బిజెపి నుండి శ్రీరామ్‌ పాల్గొన్నారు.