Sep 25,2023 23:39

పెదకాకాని రూరల్‌: స్కోప్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌.డి కొండలరావు ఆధ్వర్యంలో మండలంలోని నంబూరు దగ్గర మహమ్మద్‌ అలీ రఫత్‌ యానాది కాలనీలో డాక్టర్‌ ఎంఎస్‌ బృందా ట్యూషన్‌ సెంటర్‌ ప్రారంభించారు. సోమవారం ఈ ట్యూషన్‌ సెంటర్‌ను ఉత్తమ ఉపాధ్యా అవార్డు గ్రహీత ఈమని ప్రతాపరెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. యానాది కాలనిలో జీవిస్తున్న పిల్లలు ఈ ట్యూషన్‌ సెం టర్‌ను ఉపయోగించుకొని చదువుకుంటారని ఆశిస్తున్నా మని తెలిపారు. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ఈ సెంటర్‌ నడపడం గొప్ప విషయ మ న్నారు. చదువు ఆయుధమని, విద్యార్థులు బాగా చదువు కుని గొప్ప ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం పిల్లలకు పలకలు పుస్తకాలు అల్పాహారం అందజేశారు. కార్యక్రమంలో ట్యూషన్‌ టీచర్‌ షబనా, అబ్రహం పాస్టర్‌, చైతన్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.