స్కిల్ డెవలప్‌మెంటు సెంటర్ పరిశీలన
ప్రజాశక్తి -గూడూరు : గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ డెలప్‌మెంట్ సెంటర్ ను టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనా రాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తో కలసి పరిశీలించారు. కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఏర్పాటు చేసిన యంత్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అన్యాయంగా, అకారణంగా అరెస్టు చేశారని వైసీపీ నేతలు అంతకుఅంత అనుభవిస్తారన్నారు. స్కిల్ డెవలప్‌మెంటు సెంటర్ లో ఉన్న కోట్ల రూపాయలు మిషనరీ అంతా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అవ్వా, తాతలు తెచ్చిపెట్టారా? అని ప్రశ్నించారు. టిడిపి హయాంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ లను కొనసాగిస్తే తప్పేంటి?' అని వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తుంటే వైసీపీ నేతలకు కడుపుమంటగా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేదని, పనికి మాలిన ప్రభుత్వం వైసీపీ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.










