Oct 29,2022 21:10

ప్రజాశక్తి - కొయ్యలగూడెం
               స్కీం వర్కర్ల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు చేపడుతున్నామని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కమిటీ నాయకురాలు కె.పోశమ్మ అన్నారు. శనివారం స్థానిక అశోక్‌ నగర్‌ చేపలపేటలోని కమిటీ హాల్లో కొయ్యలగూడెం సిఐటియు ఆరో మండల మహాసభ ఎ.దుర్గారావు, ఎం.వెంకటలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల కాలంలో స్కీం వర్కర్లు అనేక సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేశారన్నారు. ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని, విఒఎల కాలపరిమితిని పెంచాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. స్కీం వర్కర్లపై వేధింపుల పెరిగాయన్నారు. మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు మూడు సంవత్సరాల కాలంలో మండలంలో సిఐటియు పోరాటాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎం.సావిత్రి, రైతు సుజాత, ఎం.వెంకటలక్ష్మి, ఎస్‌.శివకుమార్‌, గోపి, ఇస్మాయిల్‌, రాంబాబు పాల్గొన్నారు.